వరద సహాయం, పోలవరంపై చర్చ: అమిత్ షాతో జగన్ భేటీ

By narsimha lodeFirst Published Dec 15, 2020, 10:13 PM IST
Highlights

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు రాత్రి భేటీ అయ్యారు. గంట పాటు అమిత్ షాతో జగన్ సమావేశమయ్యారు.


అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు రాత్రి భేటీ అయ్యారు. గంట పాటు అమిత్ షాతో జగన్ సమావేశమయ్యారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు, నివర్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టానికి సంబంధించి సహాయం అందించాలని  ఆయన  కోరారు. రాష్ట్రంలో నష్టానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. 

alsro read::అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ: కీలక అంశాలపై చర్చ

 పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి  సవరించిన అంచనాలకు ఆర్ధిక శాఖ ఆమోదించాల్సి ఉంది. ఈ విషయాన్ని సీఎం అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు.విభజన హామీలను అమలు  చేయాలని కూడ అమిత్ షాను సీఎం కోరినట్టుగా తెలుస్తోంది.   రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై కూడ చర్చించారని సమాచారం.

నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించిన అంశాలపై కూడ ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రషెకావత్ తో కూడ భేటీకి జగన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం కూడ జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ లభిస్తే  ఆయనతో కూడ జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

click me!