పశువులకు రెండో విడత మొబైల్ అంబులెన్స్‌లు: ప్రారంభించిన సీఎం జగన్

By narsimha lodeFirst Published Jan 25, 2023, 11:43 AM IST
Highlights

పశువులకు  మొబైల్ అంబులెన్స్ లను  ఏపీ ప్రభుత్వం  ప్రారంభించింది.  ఇవాళ  165 మొబైల్ అంబులెన్స్ లను  సీఎం జగన్  ప్రారంభించారు.  గతంలో  175 అంబులెన్స్ లను  ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.  


విజయవాడ: పశువులకు వైద్యం అందించే  మొబైల్ అంబులెన్స్ లను  ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారం నాడు   తాడేపల్లిలో  ప్రారంభించారు.  గతంలో  తొలి విడతలో  175 అంబులెన్స్ లను  సీఎం జగన్  ప్రారంభించారు. రెండో విడత కింద  ఇవాళ  165 వాహనాలను  సీఎం జగన్ ప్రారంభించారు. మంత్రి  సిదిరి అప్పలరాజుతో  కలిసి  జెండా ఊపి  అంబులెన్స్ లను  సీఎం  జగన్ ప్రారంభించారు. అంబులెన్స్ ను సీఎం పరిశీలించారు.  అంబులెన్స్ లో  ఉన్న  సదుపాయాల గురించి  పశువైద్యాధికారులు  సీఎం జగన్ కు  వివరించారు.   

తొలివిడతలో  పశువులకు మొబైల్ అంబులెన్స్ లకు  రాష్ట్ర ప్రభుత్వం  రూ.129.07 కోట్లు  ఖర్చు చేసింది.   ఇవాళ  ప్రారంభించిన  165 అంబులెన్స్ లకు  రూ. 111 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. పశువులకు  అవసరమైన మందులు, వైద్యం చేసేందుకు  అవసరమైన పరికరాలు  ఈ అంబులెన్స్ లో  ఉంటాయి. తమ పశువులకు   వైద్య సహయం కోసం  ప్రభుత్వం ఏర్పాటు  చేసిన 155251 నెంబర్ కు ఫోన్  చేస్తే  అంబులెన్స్  పశువులకు  వైద్యం చేసేందుకు  ఆయా గ్రామాలకు  వెళ్తాయి.ప్రతి అంబులెన్స్ లో పశు వైద్యుడు,  సహా అతని సహాయకుడు  ఉంటారు. 

click me!