గోమాతకు పూజలు: నర్సరావుపేటలో ప్రారంభించిన సీఎం జగన్

By narsimha lode  |  First Published Jan 15, 2021, 12:26 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు నర్సరావుపేట మున్పిపల్ స్టేడియంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సీఎం పరిశీలించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. 


నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు నర్సరావుపేట మున్పిపల్ స్టేడియంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సీఎం పరిశీలించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. 

టీటీడీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై ఆలయాలల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. 

Latest Videos

మున్సిపల్ స్టేడియంలో గోమాతకు సీఎం జగన్ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

రాష్ట్రంలోని పలు దేవాలయాలపై ఇటీవల కాలంలో దాడులు చోటు చేసుకొన్నాయి. దేవాలయాలపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా దాడులు నిర్వహిస్తున్నారని జగన్ సర్కార్ భావిస్తోంది. దేవాలయాలపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని జగన్ పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.

దేవాలయాలపై దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకొంటున్న తరుణంలో  గోమాతకు పూజలు నిర్వహించడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకొంది.
ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి సందర్భంగా మంచి జరగాలని తాను కోరుకొంటున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు.
 

click me!