అది స్కిల్డ్ క్రిమినల్ చేసింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 23, 2023, 07:16 PM IST
అది స్కిల్డ్ క్రిమినల్ చేసింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

టీడీపీ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు దోపిడీ విజన్ కనిపిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు.

టీడీపీ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అధికారులతో సమీక్ష సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు అవినీతిమయం అయ్యాయని జగన్ విమర్శించారు. ప్రభుత్వానికి చెందాల్సిన రూ.371 కోట్ల సొమ్మును దోచుకున్నారని జగన్ ఆరోపించారు. ఇకపై అలాంటి పరిస్థితులకు ఆస్కారం వుండకూడదని.. నిధుల వినియోగంలో జవాబుదారీతనం వుండలని సీఎం పేర్కొన్నారు. 

ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల వల్ల పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని జగన్ చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు దోపిడీ విజన్ కనిపిస్తోందని.. ఇది స్కిల్డ్ క్రిమినల్ చేశాడంటూ సీఎం దుయ్యబట్టారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ ఖర్చు మొత్తం రూ.3,356 కోట్లని.. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం కాగా, 90 శాతం సీమెన్స్ కంపెనీ భరిస్తుందని చెప్పారని జగన్ పేర్కొన్నారు. ఎక్కడైన ఓ ప్రైవేట్ కంపెనీ రూ.3 వేల కోట్లను భరిస్తుందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 

Also Read: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. సీమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ అరెస్ట్

కాగా..చంద్రబాబు నాయడు సీఎంగా ఉన్న సమయంలో  స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లో రూ. 241 కోట్ల కుంభకోణం చోటు చేసుకొందని ఏపీ సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రమేయం ఉందని ఏపీ సీఐడీ గుర్తించింది.గత ప్రభుత్వ హయంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది.ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు దర్యాప్తులో తేల్చారు.డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్ల నగదు చేతులు మారినట్టుగా సీఐడీ అధికారులు నిర్ధారించారు. సీమెన్స్, డిజెన్స్ టెక్ సంస్థలు షెల్ కంపెనీలుగా వ్యవహరించాయనీ సీఐడీ అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే ముంబైకి చెందిన శిరీష్ చంద్రకాంత్‌‌, మాజీ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్‌ గంటా సుబ్బారావును అరెస్ట్ చేసింది ఈడీ. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్