జగన్ పొలిటికల్ బాహుబలి, పనితనం బాగుంది: ప్రభాస్ ప్రశంసలు

By Nagaraju penumalaFirst Published Aug 18, 2019, 10:39 AM IST
Highlights

తమిళనాడులో సీఎం జగన్ ను పొలిటికల్ బాహుబలిగా అభివర్ణిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. సాహో మూవీ ప్రమోషన్లో భాగంగా బిజీగా ఉన్న ప్రభాస్ ని యాంకర్ ఏపీ రాజకీయాలపై ప్రశ్నించగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. 
 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు సినీ హీరో ప్రభాస్. టాలీవుడ్ లో తాను నటించిన చిత్రం బాహుబలి అయితే జగన్ పొలిటికల్ బాహుబలి అంటూ అభివర్ణించారు. 

తమిళనాడులో సీఎం జగన్ ను పొలిటికల్ బాహుబలిగా అభివర్ణిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. సాహో మూవీ ప్రమోషన్లో భాగంగా బిజీగా ఉన్న ప్రభాస్ ని యాంకర్ ఏపీ రాజకీయాలపై ప్రశ్నించగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. 

రాజ‌కీయాల‌పై పెద్ద‌గా అవ‌గాహ‌న లేదన్న ప్రభాస్ కాక‌పోతే యంగ్ సీఎంగా జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలో న‌డిపిస్తార‌నే న‌మ్మకం తనతో పాటు ప్ర‌జ‌ల‌లో ఉందన్నారు. జ‌గ‌న్ ప‌నితనం బాగుంది అని స్ప‌ష్టం చేశారు ప్ర‌భాస్. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్ల‌తో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సీఎం జగన్. జగన్ పై ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 

ఈఏడాది జూన్ లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సైతం జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన రెబెల్ స్టార్ జగన్ రాజకీయాల్లో రియల్ హీరో అంటూ కొనియాడారు. 

మంత్రివర్గ విస్తరణలో జగన్ నిర్ణయం సామాజిక విప్లవానికి నాంది గా తాను భావిస్తున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంత్రి మండలి ఏర్పాటు చేశారంటూ అభినందించారు. 

కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించటం అభినందనీయమని కొనియాడారు. ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు కేటాయించడం మీ ఉన్నత నాయకత్వ లక్షణాలకు నిదర్శనమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. 

ఎవరూ ఊహించని విధంగా ఎనిమిది మంది బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం భవిష్యత్తు రాజకీయాలకు మార్గదర్శకంగా భావిస్తున్నట్లు తెలిపారు. పరిణతి చెందిన ప్రజా నాయకుడిగా సీఎం జగన్  స్పీకర్ పదవి బీసీలకు, డిప్యూటీ స్పీకర్ పదవి బ్రాహ్మణులకు కేటాయించడం చాలా మంచి నిర్ణయమంటూ కొనియాడిన సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.  

click me!