పవన్ కు షాక్: బీజేపీలో చేరిన లక్ష్మీ సామ్రాజ్యం

Published : Aug 17, 2019, 04:23 PM IST
పవన్ కు షాక్: బీజేపీలో చేరిన లక్ష్మీ సామ్రాజ్యం

సారాంశం

జనసేనకు ఆ పార్టీ నేత లక్ష్మీ సామ్రాజ్యం గుడ్ బై చెప్పారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆమె బీజేపీ తీర్ధం పుచ్చుకొన్నారు. 

గుంటూరు:జనసేన పెదకూరపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన పుట్టి లక్ష్మీసామ్రాజ్యం శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో 100 మంది కార్యకర్తలతో ఆమె కమలం కండువా కప్పుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన అభ్యర్థిగా పెదకూరపాడునుంచి పోటీచేయగా 7200 ఓట్లు వచ్చాయన్నారు. ఎన్నికల సమయంలో తనపై లేనిపోని దుష్ప్రచారాలు చేసి, మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టారన్నారు.
 
కష్టపడి పనిచేసేవారికి జనసేనలో విలువలేదన్నారు. అంజిబాబు లాంటి వ్యక్తి పవన్‌కల్యాణ్‌ వద్ద ఉండగా జనసేన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని ఆమె తెలిపారు. 

వైసీపీ ఓట్లు వేసిన వారిని పవన్‌కల్యాణ్‌ వద్దకు తీసుకెళ్లి జనసేన పార్టీకి ఓట్లు వేశారని చెబుతున్నారని తెలిపారు. ఈ విషయాలు తనను ఎంతో బాధపెట్టాయని, అందుకే తాను ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్