2025 జూన్ నాటికి పోలవరం పూర్తి: విజయవాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్

By narsimha lodeFirst Published Aug 15, 2023, 9:17 AM IST
Highlights

ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకొని  ఏపీ సీఎం వైఎస్ జగన్  మంగళవారంనాడు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

 


విజయవాడ:2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును  పూర్తి చేస్తామని  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు ఇండిపెండెన్స్ డే ను  పురస్కరించుకొని  విజయవాడ  ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో  ఏపీ సీఎం వైఎస్ జగన్  మంగళవారంనాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం  పోలీసుల గౌరవ వందనాన్ని  స్వీకరించారు.స్వీకరించారు.ఇండిపెండెన్స్ డే ను వేడుకలను  విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు.  ఈ వేడుకల్లో పలువురు అధికారులు, వీఐపీలు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూ  ప్రభుత్వ శకటాలను ప్రదర్శించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, విద్యాశాఖ , వైద్య ఆరోగ్య శాఖ సహా పలు  శాఖల శకటాలను  ప్రదర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ కార్యక్రమాలను  శకటాల ద్వారా  ప్రదర్శించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు పనులను  వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యమౌతున్నాయని సీఎం జగన్ వివరించారు.వెలిగొండలో  మొదటి  టన్నెల్ పనులు పూర్తి చేసినట్టుగా  ఆయన గుర్తు  చేశారు. రెండో టన్నెల్ పనులను త్వరలోనే  పూర్తి చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 

పెత్తందారి భావజాలంపై  యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. పేదలు గెలిచేవరకు.. వారి బతుకులు బాగుపడే వరకు  యుద్ధం చేస్తామని సీఎం  జగన్ ప్రకటించారు.  అంటరానితనంపై  యుద్ధాన్ని ప్రకటించినట్టుగా  ఆయన  చెప్పారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకోవడం కూడ  అంటరానితనమేనని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో  కీలక సంస్కరణలు చేపట్టినట్టుగా ఆయన గుర్తు చేశారు.  ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేస్తున్న విషయాన్ని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఆలయ బోర్డుల నుండి వ్యవసయా కమిటీల వరకు  అన్ని వర్గాలకు  అవకాశం కల్పిస్తున్నట్టుగా  సీఎం చెప్పారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు  68 శాతం మంత్రి పదవులను  కేటాయించినట్టుగా సీఎం జగన్ వివరించారు.  శాసనసభ స్పీకర్ గా బీసీ,  శాసనమండలి ఛైర్మెన్ గా ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారిని నియమించామన్నారు.139  బీసీ కులాలకు  56 ప్రత్యేక కార్పోరేషన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. శాశ్వత  బీసీ కమిషన్ ను  నియమించిన  తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని  ఆయన గుర్తు చేశారు.50 నెలల్లో డీబీటీ ద్వారా రూ.2.31 లక్షల కోట్లను లబ్దిదారులకు  అందించిన విషయాన్ని సీఎం జగన్  ప్రస్తావించారు.2 లక్షల  6 వేల 638  ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టుగా సీఎం జగన్ తెలిపారు.


 

 

 

click me!