బడ్జెట్‌ పై జగన్ ఫోకస్..ప్రతిపాదనలు కోరిన ఆర్ధికశాఖ

Siva Kodati |  
Published : Jun 13, 2019, 08:22 PM IST
బడ్జెట్‌ పై జగన్ ఫోకస్..ప్రతిపాదనలు కోరిన ఆర్ధికశాఖ

సారాంశం

సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు.

సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఈ నెల 19 నుంచి శాఖల వారీగా ప్రతిపాదనలు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నెల 19 నుంచి 24 వరకు ప్రతిపాదనలు పంపాలని ఆర్ధిక శాఖ అన్ని శాఖలను కోరింది. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఐదు రోజుల పాటు భేటీ కానున్నారు.

టీడీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టడంతో జగన్ సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీంతో ఇందులో ఏయే అంశాలకు ప్రాధాన్యతనిస్తారోనని రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?