ఈరోజు రాష్ట్రానికి చేరుకోనున్న సీఎం జగన్.. ఎల్లుండి ఢిల్లీ టూర్..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు లండన్ పర్యటన ముగించుకుని ఈరోజు అర్దరాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

Google News Follow Us

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు లండన్ పర్యటన ముగించుకుని ఈరోజు అర్దరాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్తారు. అయితే ఏపీకి చేరుకున్న తర్వాత రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే నాలుగు  రోజుల్లో సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో కానున్నట్టుగా తెలుస్తోంది. అలాగే వచ్చేవారం కేబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నట్టుగా  సమాచారం. 

అయితే ఎల్లుండి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లనున్న జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అవుతారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్‌, జమిలీ ఎన్నికలకు కేంద్రం కసరత్తు వేళ.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది. 

ఇక, వైఎస్‌ జగన్ దంపతులు సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి ప్రత్యేక విమానంలో లండన్‌కు బయలుదేరి వెళ్లారు. లండన్‌లో చదువుకుంటున్న తమ కుమార్తెలను కలిసేందుకు జగన్ దంపతులు అక్కడికి వెళ్లారు.