ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై జగన్ సర్కార్ గురువారం నాడు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. పరీక్షలను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అమరావతి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై జగన్ సర్కార్ గురువారం నాడు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. పరీక్షలను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే విద్యార్ధుల భవిష్యత్తు కోసమే పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ గురువారం నాడు సమీక్ష నిర్వహించనున్నారు.ఈ సమీక్ష సందర్భంగా టెన్త్, ఇంటర్ పరీక్షలపై జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.ఈ ఏడాది జూలై 7 నుండి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌బోర్డ్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. రోజు విడిచి రోజు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరపాలని విద్యాశాఖ ప్రతిపాదిస్తోంది.11 పేపర్లకు బదులు 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది. సెప్టెంబర్ 2 లోపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏపీ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై హైకోర్టులో పిటిషన్ కూడ దాఖలైంది. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాత పరీక్షలు నిర్వహించాలని పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ పై విచారణ సాగుతోంది. జూలై మాసంలో పరీక్షలపై తమ నిర్ణయం తీెలుపుతామని ప్రభుత్వం హైకోర్టుకు గతలంలో తెలిపింది.