ఏలూరులో వింత వ్యాధి: సీఎం జగన్ ఆరా, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

By narsimha lodeFirst Published Dec 8, 2020, 2:37 PM IST
Highlights

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారికి అందుతున్న వైద్య చికిత్సపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు ఆరా తీశారు.

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారికి అందుతున్న వైద్య చికిత్సపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు ఆరా తీశారు.

బాధితుల నుండి తీసిన శాంపిల్స్  ను పరీక్షించిన ఎయిమ్స్ బృందం కొన్ని విషయాలను ప్రకటించింది. బాధితుల శరీర నమూనాల్లో  సీసం నమూనాలు ఉన్నట్టుగా ఎయిమ్స్ బృందం ప్రకటించింది.

also read:ఏలూరులో వింత వ్యాధి: సీసీఎంబీ, సీఎఫ్‌సీ నివేదిక కోసం చూస్తున్న వైద్యులు

కేంద్రం నుండి ముగ్గురు సభ్యుల బృందం కూడ ఏలూరుకు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డాక్టర్ భవానీ కూడ ఏలూరుకు చేరుకొంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థల పరిశోధనకు చెందిన ఫలితాలు సీఎంఓకు పంపారు.

ఈ ఫలితాలపై సీఎం జగన్ ఆరా తీశారు. మరికొన్ని పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.బాధితులకు నిర్వహించిన పరీక్షలు అలాగే ఆ ప్రాంతంలో నీళ్లు, పాలకు నిర్వహించిన పరీక్షల వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

ఈ విషయమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. బుధవారం నాడు ఈ విషయమై సీఎం జగన్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు.


 

click me!