మీ నాయకత్వంలోనే మాతృభూమికి నిజమైన కీర్తి: ప్రధానికి జగన్, చంద్రబాబు, పవన్ భర్త్ డే విషెస్

Arun Kumar P   | Asianet News
Published : Sep 17, 2020, 12:21 PM ISTUpdated : Sep 17, 2020, 12:27 PM IST
మీ నాయకత్వంలోనే మాతృభూమికి నిజమైన కీర్తి: ప్రధానికి జగన్, చంద్రబాబు, పవన్ భర్త్ డే విషెస్

సారాంశం

ఈరోజు 70వ పుట్టిన రోజు జరపుకుంటున్న ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో వుండాలని ఆ దేవున్ని కొరుకుంటున్నామంటూ సీఎం జగన్, టిడిపి చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  శుభాకాంక్షలు తెలిపారు.     

అమరావతి: పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈరోజు 70వ పుట్టిన రోజు జరపుకుంటున్న ప్రధాని ఆయురారోగ్యాలతో వుండాలని ఆ దేవున్ని కొరుకుంటున్నామని ట్విట్టర్ వేదికన వీరు శుభాకాంక్షలు చెప్పారు.

 

''గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాంకాంక్షలు. దేశ సేవకు అంకితమైన మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా'' అంటూ ప్రధానికి ట్విట్టర్ వేదికన భర్త్ డే విషెస్ తెలిపారు ఏపీ సీఎం జగన్. 

read more   ప్రధాని మోదీకి రాహుల్ స్పెషల్ బర్త్ డే విషెస్

 

''గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ  గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రస్తుత క్లిష్ట సమయంలో  దేశాన్ని సమర్థంగా నడిపిస్తున్న మీకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా'' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానికి పుట్టినరోజే శుభాకాంక్షలు తెలిపారు. 

 

''గౌరవనీయులన పీఎం నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మా అందరి తరపున కూడా. ఆ మహాపురుషుడు శ్రీ అరబిందో గారు కోరుకున్నట్లు మీ ఆకర్షణీయమైన, ఉత్తేజపరిచే & అంకితమైన నాయకత్వంలో మన భారత మాతృభూమి నిజమైన కీర్తిని చూద్దాం'' అంటూ పవన్ కల్యాణ్ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. 
 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే