ఇల్లు లేని పేదలు రాష్ట్రంలో ఉండొద్దనేది లక్ష్యం: జగన్

By narsimha lode  |  First Published Jun 3, 2021, 11:55 AM IST

ఇల్లు లేని పేదవాడు రాష్ట్రంలో ఉండొద్దనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.


అమరావతి:ఇల్లు లేని పేదవాడు రాష్ట్రంలో ఉండొద్దనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ పథకానికి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్  ద్వారా  గురువారం నాడు ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  పేదల స్వంతిళ్లు కలను నిజం చేస్తున్నామని ఆయన చెప్పారు. 

 రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో తొలి దశలో గృహ నిర్మాణలు చేపడుతున్నామన్నారు. తొలి విడతలో ఈ పథకం కింద రూ. 28,084 కోట్లతో 15,60 లక్షల పక్కా గృహాలను నిర్మాణం చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి దశ గృహ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్లను నిర్మిస్తామని సీఎం తెలిపారు.

Latest Videos

రాష్ట్ర జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి పక్కా ఇంటిని నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు.  ఒక్కో ఇంటి నిర్మాణం పూర్తైతే దాని విలువ రూ. 5 నుండి 15 లక్షల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. లబ్దిదారులు కోరుకొన్నట్టుగా ఇంటి నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు ఆఫ్షన్లు ఇచ్చిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ప్రతి ఇంటికి తాగునీరుతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఆయన వివరించారు.

ఈ ఇంటి నిర్మాణాలతో రాష్ట్రంలో  ఎకానమీ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన వారికి కూడ ఉపాధి లభించనుందన్నారు.ఈ ఇంటి నిర్మాణం కోసం ధరఖాస్తు చేసుకోవచ్చని సీఎం చెప్పారు. 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు లబ్దిదారులకు అందించనున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందన్నారు. ఈ ఇంటి ప్రక్రియ పనులను చేపట్టేందుకు గాను ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ ను నియమించాలని ఆయన ఆదేశించారు.3.74 లక్షల మంది ఇళ్ల నిర్మాణానికి చెందిన కోర్టు కేసులు ఉన్నందున వారికి ఇళ్లను నిర్మించలేమన్నారు. కోర్టులకు సెలవులు ముగిసిన తర్వాత వారికి కూడ ఇళ్ల నిర్మాణం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. 


 

click me!