కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి

Published : Feb 01, 2019, 01:54 PM IST
కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి

సారాంశం

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావన లేకపోవడంపై దారుణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.  

అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావన లేకపోవడంపై దారుణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

శుక్రవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర  మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టిన  బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు.

విభజన సమస్యలపై కనీసం చివరి బడ్జెట్‌లో కూడ కేంద్రం స్పందించలేదని బాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన  హామీలను అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు సాగిస్తున్న తరుణంలో కూడ కేంద్రం స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీలో జరుగుతున్న ఆందోళనలు సరైనవేనని రుజువైందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.కేంద్రం తీరును నిరసిస్తూ న్యూఢిల్లీలో ఈ నెల 11వ తేదీన చంద్రబాబునాయుడు ఒక్క రోజు పాటు దీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే.


 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు