ఐటీ దాడులు కేంద్రం స్కెచ్: చంద్రబాబు

By Nagaraju TFirst Published Oct 5, 2018, 8:24 PM IST
Highlights

తెలుగురాష్ట్రాల్లో కలకలం రేపిన ఐటీదాడులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న కేబినేట్ సమావేశంలో ఐటీ దాడుల అంశాన్ని మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. 

అమరావతి: తెలుగురాష్ట్రాల్లో కలకలం రేపిన ఐటీదాడులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న కేబినేట్ సమావేశంలో ఐటీ దాడుల అంశాన్ని మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. మరికొంతమంది మంత్రులు కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు, ఐటీ దాడులపై వాడీవేడీగా చర్చ జరిగింది. 

రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇది మోదీ దాడి అని వ్యాఖ్యానించారు. 200 మంది సభ్యులతో కూడిన 19 బృందాలు రాష్ట్రానికి రావడం ఇదే తొలిశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఐటీ దాడులు రాష్ట్రంపై కేంద్రం దాడిగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యచరణ రూపొందించాలని నిర్ణయించారు.  

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకే భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంపై జరుగుతున్న దాడిపై న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై  లా సెక్రటరీకి సీఎం ఆదేశించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు సైతం వెళ్దామని అందుకు అంతా రెడీగా ఉండాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. 

మూకుమ్మడి దాడులతో రాష్ట్రప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కర్ణాటక, తమిళనాడులో ఈ తరహా రాజకీయం చేసిన మోదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందడాన్ని ఓర్చుకోలేక ముప్పేట దాడులు చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ విధానాన్ని దేశ స్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

click me!