కోడిగుడ్డుపై ఈకలు తీసినట్లుంది: ఎన్ఐఏ రిపోర్ట్ పై చంద్రబాబు

Published : Feb 01, 2019, 03:33 PM IST
కోడిగుడ్డుపై ఈకలు తీసినట్లుంది: ఎన్ఐఏ రిపోర్ట్ పై చంద్రబాబు

సారాంశం

 దాడి కేసులో సిట్ ఏం స్పష్టం చేసిందో ఎన్ఐఏ కూడా అదే చెప్పిందని అందులో కొత్తేమి లేదని కుండబద్దలు కొట్టారు. గుజరాత్ సీఎంగా ఎన్ఐఏని మోదీ వ్యతిరేకించారని గుర్తు చేశారు. టెర్రరిస్ట్ దాడుల లాంటి వాటిలోనే ఎన్ఐఏ చార్జ్ తీసుకుంటుందని చెబితేనే ఒప్పుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. 

అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికేసులో ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ఐఏ రిపోర్ట్ కోడిగుడ్డుపై ఈకలు తీసిన చందాన ఉందంటూ వ్యాఖ్యానించారు. అసలు కోడికత్తి కేసులో కేంద్రానికి ఏం సంబంధముందని ప్రశ్నించారు. 

దాడి కేసులో సిట్ ఏం స్పష్టం చేసిందో ఎన్ఐఏ కూడా అదే చెప్పిందని అందులో కొత్తేమి లేదని కుండబద్దలు కొట్టారు. గుజరాత్ సీఎంగా ఎన్ఐఏని మోదీ వ్యతిరేకించారని గుర్తు చేశారు. టెర్రరిస్ట్ దాడుల లాంటి వాటిలోనే ఎన్ఐఏ చార్జ్ తీసుకుంటుందని చెబితేనే ఒప్పుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. 

అంతటి కేసులను మాత్రమే టేకప్ చేసే ఎన్ఐఏ జగన్ పై దాడి కేసును ఏ ప్రాతిపదికన తీసుకున్నారని ప్రశ్నించారు. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఏం చేశారని నిలదీశారు. ఏం దొరికిందని ప్రశ్నించారు. 

సిట్ వైఎస్ జగన్ తో మాట్లాడలేదు కానీ ఎన్ఐఏ మాట్లాడింది అంతే కదా అంటూ విమర్శించారు. రాష్ట్ర సిట్ చెప్పిన మాటే ఎన్ఐఏ చెప్పిందన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం చివరికి సీబీఐని కూడా భ్రస్టుపట్టించిందని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు