ముసుగువీరుల ఆటలు ఏపీలో సాగవంటున్న చంద్రబాబు

By rajesh yFirst Published 10, Sep 2018, 6:03 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఒక పార్టీయేనా అంటూ ఎద్దేవా చేశారు. దేశమంతా ఒక దారి అయితే వైసీపీది మరోదారి అంటూ ఘాటుగా విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వైసీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 
 

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఒక పార్టీయేనా అంటూ ఎద్దేవా చేశారు. దేశమంతా ఒక దారి అయితే వైసీపీది మరోదారి అంటూ ఘాటుగా విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వైసీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 

వైసీపీకీ బీజేపీని చూస్తే కేసులు గుర్తొస్తాయని అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనడం లేదన్నారు. పెట్రోల్ ధరలపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతుంటే వైసీపీ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత వైసీపీకి లేదా అని ప్రశ్నించారు. 

మరోవైపు ఆపరేషన్ గరుడ అంటూ సినీనటుడు శివాజీ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో ముసుగు వీరుల ఆటలు సాగవంటూ విమర్శించారు. అన్ని సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో చెప్పారు. వైఎస్ జగన్ ను కాపాడుతుంది బీజేపీ కాదా అంటూ విష్ణుకుమార్ రాజును ప్రశ్నించారు. వైఎస్ జగన్ కేసులు ఎందుకు ముందుకు సాగడం లేదో మీకు తెలియదా అన్నారు చంద్రబాబు నాయుడు. 

Last Updated 19, Sep 2018, 9:22 AM IST