బాబుకు కౌంటర్: అవసరం లేకున్నా ఎక్కువ రేటుకు కొన్నారు: పీపీఏలపై జగన్

By narsimha lodeFirst Published Jul 19, 2019, 2:01 PM IST
Highlights

పీపీఏలపై జరిగిన చర్చలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య శుక్రవారం నాడు అసెంబ్లీలో వాడి వేడీ చర్చ జరిగింది. చంద్రబాబు సర్కార్ అత్యధిక ధరకు విద్యుత్ ను కొనుగోలు చేశారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు.

అమరావతి: అవసరం లేకున్నా  ఎక్కువ రేటుకు విద్యుత్‌ను గత మూడేళ్లలో చంద్రబాబునాయుడు సర్కార్  కొనుగోలు చేసిందని  ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో పీపీఏలపై చర్చ జరిగింది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కౌంటరిచ్చారు.

అవసరం లేకున్నా కొందరికి ప్రయోజనం కల్గించేందుకు చంద్రబాబునాయుడు సర్కార్ అప్పట్లో విద్యుత్‌ను కొనుగోలు చేసిందని  ఆయన ఆరోపించారు.గత మూడేళ్ల నుండి  ఏపీ ప్రభుత్వం రూ. 2635 కోట్లను అధికంగా చెల్లించందని  జగన్ గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వ ఖజనాకు నష్టం వాటిల్లిందని చెప్పారు.

2017- 18 లో 9 శాతం కొనుగోలు చేయమంటే 19 శాతం కొనుగోలు చేశారని, 2018-19 లో11 శాతం అంటే 23.4 శాతం కొనుగోలు చేశారని జగన్ గుర్తు చేశారు. 2019లో 5 శాతం  విద్యుత్ ను కొనమంటే 5.59 శాతం  కొనుగోలు చేశారని జగన్  చెప్పారు. నిపుణుల కమిటీ  రాకముందే  డిస్కం అధికారులపై చంద్రబాబునాయుడు తన అక్కసును వెళ్లగక్కుతున్నారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. 

థర్మల్ పవర్ తక్కువ రేటుకు అందుబాటులో ఉన్నా కూడ విండ్ పవర్‌ను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని  ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

వైఎస్ పీపీఏలపై ఐదేళ్లు సమీక్ష చేసి.. క్లీన్ చీట్ ఇచ్చారు: బాబు

 

click me!