ముద్దులు పెట్టే విపక్షనేత ఎక్కడ: జగన్‌పై బాబు సెటైర్లు

Published : Oct 16, 2018, 03:22 PM IST
ముద్దులు పెట్టే విపక్షనేత ఎక్కడ: జగన్‌పై బాబు సెటైర్లు

సారాంశం

 ముద్దులు పెట్టే ప్రతిపక్షనాయకుడు ఎక్కడ?... పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నా  తుఫాన్  కారణంగా  ఇబ్బందుల్లో ఉన్న  ప్రజలను ఎందుకు పరామర్శించలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.


శ్రీకాకుళం: ముద్దులు పెట్టే ప్రతిపక్షనాయకుడు ఎక్కడ?... పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నా  తుఫాన్  కారణంగా  ఇబ్బందుల్లో ఉన్న  ప్రజలను ఎందుకు పరామర్శించలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

మంగళవారం నాడు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.  తుఫాన్  ప్రభావిత ప్రాంతాల్లో  చంద్రబాబునాయుడు పర్యటించి సహాయక చర్యలను పరిశీలించారు.  ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేటకు విద్యుత్ సరఫరాను మంగళవారం సాయంత్రానికి పునరుద్దరించనున్నట్టు ఆయన తెలిపారు.

సుమారు 30 వేల  విద్యుత్ స్థంభాలు కూలిపోవడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడిందన్నారు. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొంటామన్నారు. జీడీ తోటలకు ఎకరానికి రూ. 40వేలను పెట్టుబడిగా అందిస్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే  తమకు రేషన్ సరఫరా చేయడం లేదని  గరుడభద్ర గ్రామస్థులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. రేషన్ సరఫరా చేయకుండా ఇబ్బందులు పెడితే సహించేది లేదని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. 

పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్న ముద్దులు పెట్టే ప్రతిపక్ష నాయకుడు తుఫాన్ బాధిత ప్రాంత ప్రజలను ఎందుకు పరామర్శించేందుకు రాలేదని బాబు ప్రశ్నించారు. తుఫాన్ కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోతే  కేంద్రం పట్టించుకోవడం లేదని  ఆయన  విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్