వైఎస్ఆర్‌ ఆత్మకు శాంతి చేకూరాలి: చంద్రబాబు

Published : Sep 02, 2018, 05:43 PM ISTUpdated : Sep 09, 2018, 11:56 AM IST
వైఎస్ఆర్‌ ఆత్మకు శాంతి చేకూరాలి: చంద్రబాబు

సారాంశం

దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  వైఎస్ ను స్మరించుకొన్నారు.


అమరావతి: దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  వైఎస్ ను స్మరించుకొన్నారు. వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు మంచి మిత్రులు. ఇద్దరూ కూడ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.  ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసిన తర్వాత  చంద్రబాబునాయుడు టీడీపీలో చేరారు.

చంద్రబాబునాయుడు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కాలంలో వైఎస్‌ఆర్ విపక్షనేతగా కూడ ఉన్నారు. వైఎస్ ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కాలంలో  చంద్రబాబునాయుడు విపక్షనేతగా కొనసాగారు. 

 

 

అసెంబ్లీలో ఈ ఇద్దరూ నేతలు ఒకరిపై మరోకరు చేసుకొన్న విమర్శలు కొన్ని సమయాల్లో రాజకీయాల్లో సంచనం సృష్టించాయి.కొన్ని సమయాల్లో వ్యక్తిగత విమర్శలు కూడ చోటు చేసుకొన్నాయి.

ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే వైఎస్  హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. వైఎస్ సెప్టెంబర్ రెండో తేదీన మరణించాడు. దీంతో ఆయన వైఎస్ ను గుర్తు చేసుకొన్నారు. వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. 

ఈ వార్త చదవండి

ఆత్మీయుడు హరికృష్ణ లేడని నమ్మలేకపోతున్నా: బాబు భావోద్వేగం


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్