ఆత్మీయుడు హరికృష్ణ లేడని నమ్మలేకపోతున్నా: బాబు భావోద్వేగం

Published : Sep 02, 2018, 05:23 PM ISTUpdated : Sep 09, 2018, 11:56 AM IST
ఆత్మీయుడు హరికృష్ణ లేడని నమ్మలేకపోతున్నా: బాబు భావోద్వేగం

సారాంశం

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ  మరణించడాన్ని  తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  చెప్పారు. 


హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ  మరణించడాన్ని  తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  చెప్పారు.  సెప్టెంబర్ రెండో తేదీన హరికృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని  చంద్రబాబునాయుడు భావోద్వేగమైన ట్వీట్ చేశారు.

ఆగష్టు 29వ తేదీన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందాడు. సెప్టెంబర్ రెండో తేదీన హరికృష్ణ జన్మదినం.  హరికృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని చంద్రబాబునాయుడు ఆయనను స్మరించుకొన్నారు.

 

  చైతన్య రథసారథి, తన ఆత్మీయుడు హరికృష్ణ లేడనే చేదు నిజాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని ఆయన ట్వీట్ చేశారు.  హరికృష్ణ తమ మధ్య భౌతికంగా లేకపోయినా... టీడీపీ కార్యకర్తల్లో ఆయన నింపిన స్పూర్తిని ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబునాయుడు వాగ్దానం చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే