ఎల్జీ పాలిమర్స్ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమల తొలగింపు: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం

By Siva KodatiFirst Published Sep 16, 2021, 3:25 PM IST
Highlights

ఎల్జీ పాలిమర్స్ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమలను తొలగించాలని ఏపీ కేబినెట్ ఆదేశించింది. ఆ భూముల్లో పర్యావరణ అనుకూల ప్రమాద రహిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి అనుమతినిచ్చింది.

ఎల్జీ పాలిమర్స్ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమలను తొలగించాలని ఏపీ కేబినెట్ ఆదేశించింది. ఆ భూముల్లో పర్యావరణ అనుకూల ప్రమాద రహిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి అనుమతినిచ్చింది. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మైనారిటీ సబ్ ప్లాన్‌ను ఆమోదించింది.

అలాగే రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్  నియామకానికి సంబంధించిన చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ అండ్ బీకి చెందిన ఖాళీ స్థలాలు, భవనాలను ఆర్టీసీకి బదలాయించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పదివేల మెగావాట్ల సౌర విద్యుత్ పొందేందుకు కేబినెట్ ఆమోదించింది. ఈ సౌర విద్యుత్‌ను వ్యవసాయ అవసరాలకే వినియోగించనున్నారు. 

click me!