ముగిసిన ఏపీ కేబినెట్: పెన్షన్ పెంపు సహా కీలక నిర్ణయాలు

By narsimha lode  |  First Published Dec 13, 2022, 2:18 PM IST

ఆంధ్రప్రదేశ్ కేబినెట్  మంగళవారం నాడు జరిగింది.ఈ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  కడపలో జిందాల్ స్టీల్ ప్లాంట్  సహకారంతో  ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు.ఈ విషయమై  కేబినెట్  నిర్ణయం తీసుకుంది. 


విజయవాడ: ఎస్ఐపీబీ ఆమోదించిన  విద్యుత్ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్  మంగళవారం నాడు ఆమోదం తెలిపింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన  మంగళవారంనాడు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.అదానీ,షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ నెలకొల్పే ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది.కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి  జగన్  కేబినెట్  ఆమోదం తెలిపింది. జిందాల్ స్టీల్ భాగస్వామ్యంతో  ఈ స్టీల్ ప్లాంట్  ను నిర్మించనున్నారు. ఏపీ జ్యుడిసీయల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి  కేబినెట్  అనుమతిని ఇచ్చింది.హెల్త్ హబ్స్  ఏర్పాటులో కొత్త విధానానికి  మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ పంప్‌డ్ స్టోరేజీ పవర్ ప్రమోషన్ పాలసీకి కేబినెట్ ఆమోదించింది. భూముల రీ సర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు కేబినెట్ ఆమోదించింది. 

 సామాజిక పెన్షన్లు 2750 రూపాయాలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి నుండి పెంచిన  పెన్షన్లను  పంపిణీ చేయనున్నారు. పెన్షన్ పెంపుతో  62.31 లక్షల మందికి  లబ్ది కలగనుంది. నాడు-నేడు ద్వారా స్కూల్స్ లో టీవీ ల ఏర్పాటుకు  మంత్రివర్గం అంగీకరించింది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ కంటెంట్ అందించడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయులకు బోదనేతర విధుల రద్దుకు జారీ చేసిన జీవో కు ఆమోదం తెలిపిన కేబినెట్ అనుమతిని ఇచ్చింది. 
ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరు కు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 1301.68చ.కీమీ.పరిధితో బాపట్ల అర్బన్ డెవలప్ మెంట్  ఆదారిటీ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  

Latest Videos

click me!