ఈ నెల 21 నుండి భూముల సర్వే: ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

By narsimha lodeFirst Published Nov 27, 2020, 1:55 PM IST
Highlights

నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 


అమరావతి: నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఏపీ కేబినెట్ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ సచివాలయంలో శుక్రవారం నాడు జరిగింది.

ఏపీ కేబినెట్ సమావేశంలో నివర్ తుఫాన్ నష్టం గురించి అధికారులు కేబినెట్ కు వివరించారు. ఈ తుఫాన్ కారణంగా ఏఏ జిల్లాల్లో ఏ రకమైన పంటలకు నష్టం వాటిల్లిందనే విషయమై అధికారులు కేబినెట్ కు వివరించారు. ప్రాథమికంగా రాష్ట్రంలోని 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

also read:నేడు ఏపీ కేబినెట్ సమావేశం: కీలక అంశాలపై చర్చ

డిసెంబర్ 15వ తేదీలోపుగా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలను అందించాలని సీఎం ఆదేశించారు.

నివర్ తుఫాన్ కారణంగా  రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్టుగా అధికారులు సీఎంకు తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇటీవల కాలంలో ఇంటి పన్నును సవరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొంది.ఈ మేరకు తీసుకొచ్చిన బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 25న పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

30.20 లక్షల మందికి డీ ఫాం పట్టాలు ఇవ్వనుంది ఏపీ సర్కార్. లే ఔట్ల అభివృద్ది, ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నెల 21నుండి భూముల రీ సర్వే కు కేబినెట్ అంగీకరించింది.  డిసెంబర్ 8న 2.49 లక్షల మందికి గొర్రెలు, మేకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
 

click me!