శ్రీకృష్ణదేవరాయలు పద్యం చదివి తెలుగులో బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన

By Sree sFirst Published Jun 16, 2020, 1:51 PM IST
Highlights

బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ని ప్రవేశపెడుతూ... బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాను తెలుగు భాషలో బడ్జెట్ ని చదవబోతున్నానని చెబుతూ దేశ భాషలందు తెలుగు లెస్స, అనే తెలుగు పద్యాన్ని ఆలపించారు. 

బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ని ప్రవేశపెడుతూ... బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాను తెలుగు భాషలో బడ్జెట్ ని చదవబోతున్నానని చెబుతూ దేశ భాషలందు తెలుగు లెస్స, అనే తెలుగు పద్యాన్ని ఆలపించారు. 

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స 

ఆముక్తమాల్యదను తెలుగులో రాయమని శ్రీమహావిష్ణువు పురమాయించారని చెబుతూ... దానికిగల కారణాన్ని  శ్రీకృష్ణదేవరాయలు ఇలా వివరించారట. దేశంలో ఉన్న భాషల్లో తెలుగు రాజులూ గొప్పవారు. దేశంలోని భాషల్లో తెలుగు భాష తీయనైనది అని చెప్పినందుకు గాను తాను తెలుగులో రాసాను అన్నారట. 

అందుకోసమని దేశభాషలందు తెలుగు లెస్స అని అన్నారు. అందుకోసమనే తాను బడ్జెట్ 2020-21 బడ్జెట్ ను తెలుగులో చదువుతున్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే... ఉదయం గవర్నర్ ప్రసంగం తరువాత సభ వాయిదా పడిన అనంతరం బీఎసీ సమావేశం ప్రారంభమైంది. 

స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు.ఇక టీడీపీ తరపున టీడీఎల్పీ ఉప నాయకుడు నిమ్మల రామానాయుడు హాజరయ్యారు.

బీఏసీ సమావేశంలో టీడీపీ తరపున 16 అంశాలను ఎజెండాలో పెట్టాలని టీడీపీ పట్టుబట్టింది. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి అరెస్ట్‌తో పాటు పలు అంశాలను టీడీపీ బీఏసీ సమావేశంలో ప్రస్తావించింది. 

కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం,  అమరావతి రాజధాని అంశం, ఏపీకి ప్రత్యేక హోదా, విద్యుత్ ఛార్జీల పెంపు, బలవంతపు భూసేకరణ, భూ కొనుగోళ్లలో అక్రమాలు.

ఇసుక అక్రమ రవాణా,మద్యం ధరల పెరుగుదల,దళితులపై దాడులు, ప్రభుత్వ భూముల విక్రయంపై చర్చించాలని టీడీపీ డిమాండ్ చేసింది. అంతేకాదు ఈ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ పట్టుబట్టింది.

అసెంబ్లీ సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రారంభించారు. కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని టీడీపీ కోరినట్టుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే శాసనమండలి బీఏసీ సమావేశం ఛైర్మెన్ షరీఫ్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,  టీడీపీ తరపున యనమల రామకృష్ణుడు హాజరయ్యారు.

click me!