ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారు..

Published : May 18, 2023, 05:14 PM IST
ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు అయింది. 

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు అయింది.  గుంటూరు-1 మంగళగిరి రోడ్డు ఏఎస్ ఫంక్షన్ హాల్ పక్కన ఏపీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఈ నెల 21వ తేదీన(ఆదివారం) ఉదయం 11.35 గంటలకు ప్రారంభించనున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు తోట చంద్రశేఖర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏపీ ప్రజలకు బీఆర్ఎస్ చాలా బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. 

ఇదిలా ఉంటే, ఇటీవల తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనున్నట్టుగా చెప్పారు. అలాగే ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో బరిలో దిగనున్నట్టుగా తెలిపారు. తెలంగాణ మోడల్‌ దేశమంతా విస్తరించాలని ప్రజలు ఆశిస్తున్నారని తోట చంద్రశేఖర్ చెప్పారు. బీజేపీ దేశంలోని ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టిస్తోందని ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్