
చంద్రబాబు తప్పు చేసుంటే తప్పకుండా శిక్షపడుతుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రేపు జగన్ కేసుల్లో తప్పు చేసినట్లు తేలినా శిక్ష తప్పదని ఆయన తేల్చిచెప్పారు.
స్థానిక ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు తేడా ఉంటుందని సోము వీర్రాజు తెలిపారు. కింది స్థాయిలో బీజేపీ- జనసేన బలంగా వుందని ఆయన పేర్కొన్నారు.
సంక్షేమ పాలన చేస్తారని ప్రజలు అధికారమిస్తే వైసీపీ పరిపాలనను గాలికి వదిలేసిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ . ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత దోచుకోవాలనే దానిపైనే దృష్టి పెట్టి అధికారాన్ని వ్యాపారంగా మార్చారని వీర్రాజు ఆరోపించారు.
పంచాయతీ బోర్డు మెంబర్ కోసం 51లక్షల ఖర్చు పెట్టే స్థాయికి వైసీపీ చేరిందన్న సోము వీర్రాజు.. ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటే జగన్ పార్టీని జనం కూకటి వేళ్లతో పెకిలిస్తారని హెచ్చరించారు.