
తానా సభల్లో బీజేపీ నేత రాంమాధవ్‌ను అవమానించడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. అవి తానా సభలు కాదని.. టీడీపీ భజన సభలంటూ సెటైర్లు వేశారు.
పచ్చ తమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగువారి ప్రతిష్టను దిగజారుస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంమాధవ్ ప్రసంగానికి అడ్డు తగిలి.. లోకేశ్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ధిని బయటపెట్టారని ఫైరయ్యారు.
టీడీపీ బురద రాజకీయాలలోంచే కమల వికాసం జరుగుతుందంటూ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. తానా 22వ మహాసభలకు హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ప్రసంగిస్తుండగా.. ఈలలు, కేకలు వేస్తూ ఆయన వేదిక దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో మాధవ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించి వెనుదిరిగారు.