Purandeswari: ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై నిర్ణయం అధిష్ఠానానిదేనని చెప్పారు. జనసేనతో బంధుత్వం లేదని అధిష్టానం చెప్పలేనట్టేనని అన్నారు.
Purandeswari: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైసీపీ మరోసారి అధికారం చేపట్టాలని ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే పలు అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాల్లోనూ తమ అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతోంది.మరోవైపు కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టినా వైఎస్ షర్మిల.. ఎలాగైనా తన పార్టీని గాడిలోకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఇక ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి - జనసేనతో పొత్తు దాదాపు ఖరారైన సమయంలో అనూహ్యంగా ఈ పార్టీలతో బిజెపి పొత్తుకు సిద్దమైనట్టు వార్తలు వినబడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇరుపార్టీల నేతలతో బిజెపి అగ్రనేతలు కేంద్ర మంత్రి అమీషా జెపి నడ్డా లు.చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఇదిలా ఉంటే.. పొత్తు వ్యవహారంపై బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు విషయంలో తమ పార్టీ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు ఇప్పటికే జనసేన తమ మిత్రపక్షమని బాహాటంగానే వెల్లడించారు. సార్టీ అధిష్టానం మేరకు పార్లమెంటు ఎన్నికలలో పోటీకి బిజెపి సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిజెపి ప్రత్యేక హోదా కాకుండా స్పెషల్ ప్యాకేజీ లు స్వాగతించిందని తెలిపారు. పార్టీ సంస్ధాగత బలోపేతానికి తాము కృషి చేస్తున్నామన్నారు. తమకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని అన్నారు.ప్రధాని చెప్పినట్టు ఎంపీ స్ధానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొత్తులు ఎలా ఉన్నా సంస్ధాగతంగా బలోపేతం కావడంపై బీజేపీ దృష్టి పెడుతుందని తెలిపారు.