ఏపీ పోలీసులు దద్దమ్మలు... ఏం రోగమొచ్చింది వారికి...: సోము వీర్రాజు సీరియస్

By Arun Kumar PFirst Published Apr 18, 2021, 1:07 PM IST
Highlights

పోలీసు వ్యవస్థ తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. 

అమరావతి: తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. నిన్న(శనివారం)పోలింగ్ సమయంలో వాలంటీర్లతో ఓటర్లనే కాదు బూత్ ఎజెంట్స్ తో తమ పార్టీ ఎజెంట్స్ ను బెదిరించారని ఆరోపించారు. కళ్లముందే ఇంత జరుగుతున్నా ఏపీ పోలీసులు దద్దమ్మల్లా చూస్తుండిపోయారంటూ వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''పోలీసు వ్యవస్థ తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఏకపక్షంగా వ్యవహరించింది. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీది కాదు... రాజ్యాంగబద్ద వ్యవస్థ అని డిజిపి తెలుసుకోవాలి. పోలీసుల ఎదుటే అక్రమాలు జరుగుతుంటే చోద్యం చూసారు. పోలీసులకు ఏం రోగం వచ్చింది. దొంగ ఓట్లు వేస్తున్నారని ఎస్పీకి పిర్యాదు చేసిన స్పందించలేదు'' అని మండిపడ్డారు.

''తిరుపతిలో కేవలం 60శాతం పోలింగ్ మాత్రమే జరిగింది... ఇదంతా ప్రభుత్వ అనుకూల ఓటర్లే. పట్టపగలు  దొంగ ఓట్లు  వేశారు. అభివృద్ధి ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఎమ్మెల్యే, మంత్రులు ఎందుకు తిరుపతిలో మకాం వేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది'' అని పేర్కొన్నారు. 

read more  భర్త ఎవరో తెలియని దుస్థితికి మహిళల్ని దిగజార్చి...: తిరుపతి పోలింగ్ పై నాదెండ్ల సంచలనం

''మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రామకృష్ణా రెడ్డి ఉప ఎన్నికల్లో కుట్రలకు పాల్పడ్డారు. ఎర్ర చందనం దుంగలు పెట్టి కేసులు పెడుతున్నారు.   ఎన్నికల కోడ్ అమలులో ఉంటే తిరుపతిలో రామచంద్ర రెడ్డి ప్రెస్ మీట్ ఎలా పెడతారు'' అని నిలదీశారు. 

''ఉప ఎన్నికల్లో అక్రమాలపై సీఎం జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. తిరుపతిలో రీ పోలింగ్ జరపాలి'' అని బిజెపి అధ్యక్షులు వీర్రాజు డిమాండ్ చేశారు. భవిష్యత్ లో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల కోసం వైసిపి దొంగ ఓట్లను రెడీ చేసిందని వీర్రాజు ఆరోపించారు. 
 

click me!