పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తాం.. ప్రతిపక్షం బీజేపీయే: సోము వీర్రాజు ప్రకటన

Siva Kodati |  
Published : Apr 02, 2021, 09:40 PM ISTUpdated : Apr 02, 2021, 10:13 PM IST
పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తాం.. ప్రతిపక్షం బీజేపీయే: సోము వీర్రాజు ప్రకటన

సారాంశం

పరిషత్ ఎన్నికలను ఎదుర్కొంటామని ప్రకటించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. పరిషత్ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని వీర్రాజు వెల్లడించారు. అధికారంలో వున్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా బీజేపీ వ్యవహరించదని ఆయన పేర్కొన్నారు

పరిషత్ ఎన్నికలను ఎదుర్కొంటామని ప్రకటించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. పరిషత్ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని వీర్రాజు వెల్లడించారు.

అధికారంలో వున్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా బీజేపీ వ్యవహరించదని ఆయన పేర్కొన్నారు. వైసీపీని ఎదుర్కొనే సత్తా బీజేపీకే వుందని వీర్రాజు వెల్లడించారు. ప్రజలతో కలిసి వైసీపీ దౌర్జన్యాలపై పోరాడతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. 

అంతకుముందు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోము వీర్రాజు లేఖ రాశారు. టీడీపీ హయాంలో వైద్య పరికరల తయారీలో అవకతవకలు జరిగాయన్నారు. కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు.

నిష్పక్షపాతంగా విచారించి, దోషులను కోర్టు ముందు నిలబెట్టాలన్నారు సోము వీర్రాజు. వైద్య శాఖలో టీబీఎస్ స్కాంపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది. వెంకట రామరాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసింది. నిందితులుగా టీబీఎస్ సంస్థతో పాటు పలువురు సిబ్బందిని కూడా చేర్చింది.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు