జగన్ ప్రతి పథకం వెనుకా మా డబ్బే: సోము వీర్రాజు

Siva Kodati |  
Published : Dec 02, 2020, 06:17 PM IST
జగన్ ప్రతి పథకం వెనుకా మా డబ్బే: సోము వీర్రాజు

సారాంశం

ప్రభుత్వం అప్పులు చేసి నవరత్నాలు అందిస్తోందని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన అభివృద్ధి ఒక్కటే తమ పార్టీ నినాదమని, ప్రధాని మోదీ శ్వాస, ధ్యాస కూడా అదేనని చెప్పారు

ప్రభుత్వం అప్పులు చేసి నవరత్నాలు అందిస్తోందని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన అభివృద్ధి ఒక్కటే తమ పార్టీ నినాదమని, ప్రధాని మోదీ శ్వాస, ధ్యాస కూడా అదేనని చెప్పారు.

తమది సకల జనుల పార్టీ అని.. ప్రాంతీయ పార్టీల మాదిరిగా రాగద్వేషాలు ఉండబోవని వీర్రాజు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం వెనుకా కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులే ఉన్నాయని సోము వీర్రాజు వెల్లడించారు.

కానీ ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. విద్య, వైద్యం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి.. ఇలా 35 అంశాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నట్లు సోము వీర్రాజు పేర్కొన్నారు.

వైసీపీ, టీడీపీ రెండూ అంటకాగే పార్టీలని ఆయన సెటైర్లు వేశారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్న వారంతా విజయవాడ, అమరావతి చుట్టూ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అమరావతే రాజధానిగా కొనసాగుతుందని వీర్రాజు కుండబద్ధలు కొట్టారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Speech On AP Local Body Elections 2026 | Palle Panduga 2026 | Asianet Telugu
పవన్ ని ఆకాశానికెత్తిన బాబు | Chandrababu Speech At Palle Panduga 3.0 | Asianet Telugu