ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: రాజీనామా చేయకుండా పార్టీ మారినా చర్యలు తప్పవని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంను మీడియా ప్రశ్నించింది. ఈ విషయమై స్పీకర్ తమ్మినేని సీతారాం ఇలా స్పందించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడ ఇదే విషయాన్ని చెప్పారని స్పీకర్ తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. డిసెంబర్ 2 నుండి 15 రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
Also Read: జూ.ఎన్టీఆర్ ను తేవాలన్నప్పుడు అడిగామా: లోకేష్, బాబులను ఏకేసిన వంశీ
సాంకేతికపై డిల్లీలో జరిగిన సభాపతుల సబ్ కమిటీ సమావేశంలో తమ్మినేని సీతారాం పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో కాగిత రహిత వ్యవస్థ పాలనపై డిసెంబర్ 17న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేదిక అందించనున్నట్టుగా తమ్మినేని సీతారం చెప్పారు.
Also Read:చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా ఈ ఏడాది అక్టోబర్ 27వ తేదీన రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ చీప్ చంద్రబాబునాయుడుకు లేఖ పంపారు. అయితే ఈ రాజీనామా లేఖ వాట్సాప్‌లో పంపారు.ఈ రాజీనామా లేఖను చంద్రబాబునాయుడు స్పీకర్ కు పంపారా, లేదా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు.