ఇసుక కొరత తీరుస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నాం: పెద్దిరెడ్డి

By telugu teamFirst Published Nov 16, 2019, 10:20 PM IST
Highlights

ఇసుక కొరత తీర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.

నాగలాపురం: రాష్ట్ర ప్రభుత్వం ఇసుక కొరతను నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. శనివారం సత్యవేడు నియోజక వర్గం నాగలాపురం మండలం సురుటుపల్లిలో గల ఇసుక రీచ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ ప్రకారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇసుక వారోత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇసుక వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండున్నర లక్షల టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చామని  ఆయన తెలిపారు. 80 వేల టన్నుల ఇసుకే వాడకానికి సరిపోతుందని కానీ రెండున్నర లక్షల టన్నుల ఇసుకను అందు బాటులోకి తెచ్చామని తెలిపారు. 

ఇప్పటి వరకు లక్షా ఎనభై వేల టన్నుల ఇసుక కొరకు మీ - సేవ నందు నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు. అవసరాలకు మించి రెట్టింపు స్థాయిలో ఇసుకను అంధుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రతి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు 150 నుండి 200 దాకా చెక్ పోస్ట్ లను ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. 

 ప్రతి చెక్ పోస్ట్ వద్ద ఏపి ఎండిసి, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు శాఖల సమన్వయంతో అక్రమ రవాణా నియంత్రణకు అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేంధుకు డిజిపి అధికారిని నియామకం చేయనునట్లు తెలిపారు. 

ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించిన ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ అమ్మిన రెండు సంవత్సరాల జైలు శిక్ష, రెండు లక్షల జరిమానా విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మూడు నెలలగా వర్షాల కారణంగా ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు బాగా పడుతుండడంతో రైతులు సంతోషంగా పంటలు పండించేందుకు వీలు కలిగిందని తెలిపారు.

click me!