నిమ్మల, అచ్చెన్నాయుడిపై ఫిర్యాదులు: రేపు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ

Published : Dec 22, 2020, 02:50 PM ISTUpdated : Dec 22, 2020, 02:55 PM IST
నిమ్మల, అచ్చెన్నాయుడిపై ఫిర్యాదులు: రేపు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ  ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన  కమిటీ సమావేశం కానుంది. టీడీపీ శాసనసభపక్ష ఉప నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులపై ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పై చర్చించే అవకాశం ఉంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సభను తప్పుదోవ పట్టించే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారని అధికారపక్షం ప్రివిలేజ్ మోషన్ పెట్టిన విషయం తెలిసిందే.ఈ ఫిర్యాదుల మేరకు ప్రివిలేజ్ కమిటీ రేపు అసెంబ్లీలో సమావేశం కానుంది. శాసనసభను అడ్డుకోవడంపై అచ్చెన్నాయుడిపై అధికారపక్షం ఫిర్యాదు చేసింది.

సభను తప్పుదోవ పట్టించే విధంగా  నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారని సభలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఏకంగా సీఎం జగన్ రామానాయుడిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నానని ఆయన ప్రకటించారు.ప్రివిలేజ్ కమిటీ రేపు సమావేశం కావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకొంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?