ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం నాడు జరగనుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ చర్చించనుంది.
అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం నాడు జరగనుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ చర్చించనుంది.
ఏపీ శాషనసభ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు.
also read:ఏపీ ఎస్ఈసీ యాప్: కోర్టుకు వెళ్లే యోచనలో వైసీపీ
మంత్రులు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఇచ్చిన ఫిర్యాదులను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం నాడు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేశారు. ఈ సిఫారసు ఆధారంగా ఇవాళ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది.మంత్రుల ఫిర్యాదుకు సంబంధించి ఎస్ఈసీని ప్రివిలేజ్ కమిటీ వివరణ అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు నిమ్మగడ్డ రాసిన లేఖలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల పేర్లను ప్రస్తావించారు. ఈ ఇద్దరు మంత్రులు లక్ష్మణ రేఖను దాటారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రులు మండిపడుతున్నారు. ఈ విషయమై మంత్రులు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.