AP Assembly: ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు.. గౌతమ్ రెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్

Published : Mar 08, 2022, 09:45 AM ISTUpdated : Mar 10, 2022, 04:26 PM IST
AP Assembly: ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు.. గౌతమ్ రెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget session) రెండో రోజు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy) మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget session) రెండో రోజు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy) మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఎం జగన్ ప్రభుత్వం తరఫున సభలో ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. సంతాప తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడుతూ గౌతమ్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

ఈ సంతాప తీర్మానంపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డి మరణవార్త వినగానే షాక్‌కు గరయ్యానని చెప్పారు. గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. వివాదాలు లేని వ్యక్తి గౌతమ్ రెడ్డి అని తెలిపారు. గౌతమ్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డి వివాదరహితుడని చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డి అజాత శత్రువు అని అన్నారు. గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి రావడం దురదృష్టకరమని చెప్పారు. సీఎం జగన్‌కు గౌతమ్ రెడ్డి నిజమైన సైనికుడని అన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నానని తెలిపారు. 

ఇక, ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 25 వరకు కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నేడు గౌతమ్‌రెడ్డి మృతిపై సంతాపం తెలిపిన తర్వాత సభ వాయిదా పడనుంది. 9వ తేదీన గౌతమ్ రెడ్డి మృతికి సంతాపంగా అసెంబ్లీకి సెలవుగా నిర్ణయించింది. 10వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, చర్చ జరగనుంది. 11వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 12,13 శని, ఆదివారాలు సభకు సెలవు. 14,15 తేదీల్లో బడ్జెట్‌పై సభలో చర్చ జరగనుంది. 16,17 తేదీల్లో బడ్జెట్ డిమాండ్లపై చర్చ సాగనుంది. 

18న హోలీ, 19, 20 శని, ఆదివారాలు సభకు సెలవు ఉండనుంది. తిరిగి  21 నుంచి 24వ తేదీ వరకు బడ్జెట్‌ డిమాండ్లపై చర్చ సాగనుంది.  25న ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. శాసన మండలి సమావేశాలు కూడా ఇదే షెడ్యూల్‌ ప్రకారం జరుగనున్నాయి. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu