AP Assembly session : నేతల ఇళ్లలో వేడుకల కోసం సభకు సెలవులా? మండిపడ్డ చంద్రబాబు..

Published : Mar 08, 2022, 09:38 AM IST
AP Assembly session : నేతల ఇళ్లలో వేడుకల కోసం సభకు సెలవులా? మండిపడ్డ చంద్రబాబు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇవి మార్చి 25వ తేదీ వరకు జరగనున్నాయి. కాగా బొత్స సతస్యనారాయణ కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం శాసనసభ సమావేశాలకు బుధవారం సెలవు ప్రకటించారని టీడీపీ మండిపడుతోంది.

అమరావతి : పురపాలక మంత్రి Botsa Satyanarayana కుమారుడి వివాహ Reception కోసమే శాసనసభ సమావేశాలకు బుధవారం సెలవు ప్రకటించారని TDP Legislature విమర్శించింది. నేతల ఇళ్లలో పెళ్లిళ్లు, పేరంటాలకు సభకు సెలవులు ఇవ్వడమేంటని.. ప్రశ్నించింది. టీడీపీ శాసనసభాపక్ష సమావేశం సోమవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత 
Chandrababu అధ్యక్షతన జరిగింది. 

ఉదయం శాసనసభా సలహా కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యల గురించి చంద్రబాబు, ఇతర నాయకులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు. నేతల ఇళ్లలో వేడుకలకు సెలవులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని శాసనసభాపక్షం పేర్కొంది. వైసీపీ ప్రభుత్వం వింత పోకడలతో సభా గౌరవం తగ్గేలా వ్యవహరిస్తోందని నాయకులు అభిప్రాయపడ్డారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో సోమవారం నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం జగన్‌, మంత్రులు బుగ్గన, కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. మార్చి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 13 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మృతికి గౌరవ సూచకంగా ఈనెల 9వ తేదీన సభకు సెలవుగా ప్రకటించారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉగాది నుండి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుందని ప్రకటించారు. వీకేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ది సాగుతుందని చెప్పారు. గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కౄషి చేస్తోందని తెలిపారు. కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు.  రాష్ట్రం అభివృద్ది పథంలో పయనిస్తుందని గవర్నర్ చెప్పారు. విద్య,వైద్యం, వ్యవసాయ రంగాల్లో మైరుగైన అభివృద్దిని సాధించామన్నారు. Coronaతో దేశం, రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పాలనను కిందిస్థాయి వరకు వర్తింపసేసేలా గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయని గవర్నర్ చెప్పారు.

గవర్నర్ ను ఎలా గౌరవించాలో మీరా మాకు నేర్పేది : అయ్యన్న పాత్రుడు 
గవర్నర్ ను ఎలా గౌరవించాలో సీఎం జగన్ టీడీపీకు చెప్పక్కర్లేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోమవారం ట్విటర్ లో పేర్కొన్నారు. ‘వయసులో పెద్ద వారైన గవర్నర్ ను తెలుగుదేశం గౌరవించాలని సీఎం జగన్ రెడ్డి అంటున్నారు. వయసులో పెద్దవారు, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయికి ఆయనిచ్చిన గౌరవమేంటో అందరికీ తెలుసు’ అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా.. ‘రాజ్యాంగ హోదాలో ఉన్నగవర్నర్ ను అవమానిస్తారా? ఇదేం పద్దతి..  కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా కాగితాలు చించేసి ఆయనపై విసరడం ఏంటి?’  అని ముఖ్యమంత్రి జగన్ టిడిపి సభ్యులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగిన శాసన సభ వ్యవహారాల సలహా మండలి (BAC) సమావేశంలో ఇదే అంశాన్ని సీఎం ప్రస్తావిస్తూ సమావేశానికి హాజరైన TDP పక్ష ఉపనేత అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. ‘చరిత్రలో ఎప్పుడూ ఇలాంటివి లేవు.  మీ సభ్యుల తీరు అసెంబ్లీ పవిత్రతను నాశనం చేసేలా ఉంది’ అని సీఎం అన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu