ఏపీ అసెంబ్లీ: బీఎసీ సమావేశం ప్రారంభం

Published : May 20, 2021, 10:30 AM IST
ఏపీ అసెంబ్లీ: బీఎసీ సమావేశం ప్రారంభం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బీఏసీ సమావేశం గురువారం నాడు ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు హాజరయ్యారు.  గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీకి టీ బ్రేక్ కోసం వాయిదా వేశారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బీఏసీ సమావేశం గురువారం నాడు ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు హాజరయ్యారు.  గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీకి టీ బ్రేక్ కోసం వాయిదా వేశారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.

ఒక్క రోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ  అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన  బీఏసీ సమావేశం ప్రారంభమైంది.   అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశం ఎప్పుడు చేపట్టాలనే దానిపై  ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

also read:కరోనాను ఎదుర్కోవడంలో దేశానికే ఏపీ ఆదర్శం: గవర్నర్ బిశ్వభూషణ్

ఈ బడ్జెట్ సమావేశాల్లో సుమారు  7 బిల్లులను ప్రవేశపెట్టాలని  ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు అసెంబ్లీ తెలపనుంది. కరోనా నేపథ్యంలో  అసెంబ్లీని ఒక్క రోజుకే పరిమితం చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. కరోనా ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై పడినా సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపులను యధావిధిగా కొనసాగించే అవకాశం లేకపోలేదు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్