ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

By narsimha lodeFirst Published Jun 17, 2020, 4:23 PM IST
Highlights

ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు  ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదాపడింది.


అమరావతి:ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు  ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదాపడింది.

ఈ నెల 16వ తేదీన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలను ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

also read:మండలికి కీలక బిల్లులు, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ దూరం: చంద్రబాబు ఫోన్

మంగళవారం నాడు మధ్యాహ్నమే ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను గతంలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే కరోనా నేపథ్యంలో సమావేశాలను వాయిదా వేశారు.

also read:19న రాజ్యసభ ఎన్నికలు: ఎమ్మెల్యేలకు టీడీపీ విప్

మూడు మాసాల బడ్జెట్ కోసం రూ. 70 వేల కోట్లకు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 28వ తేదీన జారీ చేసింది. మూడు మాసాల గడువు దాటిపోతోంది. దీంతో అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించింది. 2020-21 బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.

ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన తర్వాత  అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.రెండు రోజుల పాటు జరిగిన 15 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది, బడ్జెట్, గవర్నర్ ప్రసంగాలపై ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించింది.స్వల్పకాలిక చర్చలు, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లేకుండా శాసనసభ సమావేశాలు ముగిశాయి.
 

click me!