మరో సచివాలయ ఉద్యోగికి కరోనా... అధికారుల తీరుపై జగన్ అసంతృప్తి

By Arun Kumar PFirst Published Jun 4, 2020, 9:09 PM IST
Highlights

ఏపి సచివాలయంలో రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. సచివాలయంలో పనిచేసే మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. 

అమరావతి: ఏపి సచివాలయంలో రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. సచివాలయంలో పనిచేసే మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే భయాందోళనలో వున్న ఉద్యోగుల్లో మరింత కలవరం మొదలయ్యింది. 

సచివాలయంలో ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర విధులు నిర్వహించే అటెండర్ కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో  అతడితో పాటు పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. అలాగే వారిని హోంక్వారంటైన్ లో వుండాలని ఆదేశించారు. 

ఇదివరకే సచివాలయ ఉద్యోగులకు కరోనా సోకిన విషయం  తెలిసిందే. దీంతో అప్రమత్తమై వైరస్ వ్యాప్తిచెందకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

read  more  రాజధాని గ్రామాల్లో కరోనా కలకలం... వాలంటీర్ కు పాజిటివ్

ఏపి ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే సచివాలయం ఉద్యోగులు ఈ మహమ్మారి బారిన పడగా ఓ విద్యుత్ సౌద ఉద్యోగికి ఈ వైరస్ సోకింది. తాజాగా మరో సచివాలయ ఉద్యోగి ఈ వైరస్ బారిన పడ్డాడు. 

ఏపిలో కరోనా వైరస్ కరళా నృత్యం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చినవారి వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. బుధవారం ఒక్కరోజే ఏపీలో 180 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. 

ఇతర రాష్ట్రాల నంచి వచ్చినవారిలో 94 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ఏడుగురికి కరోనా వైరస్ వచ్చినట్లు తేలింది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 68 మంది మరణించారు. 

ఏపీలో 967 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 2224 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3279కి చేరుకుంది. బుధవారం 8,066 శాంపిల్స్ ను పరీక్షించగా 79 మందికి మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 35 మంది  కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

విదేశాల నుంచి వచ్చినవారిలో 119 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ కేసుల్లో 118 యాక్టివ్ గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 573 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. వీరిలో 362 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

click me!