మొన్న వింత వ్యాధి... ఇప్పుడు వింత జంతువు.. ఏపీని వణికిస్తున్నాయి..

By AN TeluguFirst Published Dec 16, 2020, 12:16 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ను రకరకాల వింత వ్యాధులు, వింత జంతువులు భయానికి గురి చేస్తున్నాయి. ఏలూరి వింతవ్యాధి కాస్త తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో వింత జంతువు కలకలం రేపుతోంది. 

తూర్పు గోదావరి జిల్లా జొన్నాడలో వింతజంతువు కలకలం రేపింది. కొద్దిరోజులుగా వింత జంతువు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు స్థానికులు సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆ వింత జంతువు పశువులపై దాడిచేసి చంపుతోందని స్థానికులు చెప్తున్నారు. 

ఆలమూరు మండలం పెనికేరులోని ఓ పాడుబడ్డ బావిలో ఆ వింత జంతువు ఉన్నట్లు రైతులు గుర్తించారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.  
ఆ వింత జంతువు ఏంటి, ఎందుకు పశువులను చంపి తింటోంది అనే విషయం మీద ఇప్పటివరకు ఏ వివరాలూ తెలియరాలేదు. 

click me!