
అమరావతి : YCP government అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో మొదటిసారిగా నెల తొలి రెండు రోజుల్లోనే పూర్తిస్థాయి వేతనాలు, పెన్షన్లు పడిన విషయం తెలిసిందే. హడావుడిగా ప్రభుత్వ ఉద్యోగులకు salaries వేసి ఏపీ సర్కార్ నాలుక కరుచుకుంది. ‘తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి’ అన్న రీతిలో జీతాలు ఉద్యోగుల అకౌంట్ లలో వేసేసింది. అయితే ట్రెజరీ ఉద్యోగులతో సంబంధం లేకుండా ఈ జీతాలు వేసి తప్పులో కాలేసింది.
మరణించిన, సస్పెండైన, పెన్షనర్లకు సైతం పూర్తి స్థాయిలో జీతాలు వేసింది. ఆ తరువాత లెక్కలు సరి చూసుకుని తెల్లమొహం వేసింది. లెక్కల్లో భారీగా తేడా వచ్చేసింది. దీంతో ఆఘమేఘాల మీదTreasury ఉన్నతాధికారులకు మరణించిన, సస్పెండ్ అయిన, పెన్షనర్ల వివరాలు ఇవ్వాలని Ministry of Finance ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రొఫార్మా పంపారు. అనర్హులకు జీతాలు పడ్డాయని ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. దీంతో అనర్హులకు జీతాలు పడితే వారి వివరాలు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, జగన్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులంతా ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలోనే గురువారం ఛలో విజయవాడను విజయవంతం చేసిన ఉద్యోగులు.. ఈ రోజు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు. తమ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తూ సచివాలయ ఉద్యోగులు pen down చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరష్కరించే వరకు విధులకు దూరంగా వుంటామని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేసారు.
ఇప్పటికే పీఆర్సీ నిరసలను ఉదృతం చేస్తూ ఈ నెల 7వ తేదీసోమవారం నుండి సమ్మెకు దిగనున్నట్లు ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సెక్రటేరియట్ ఉద్యోగులు ఓరోజు ముందుగానే తమ సమ్మెను ప్రారంభించారు. రేపు, ఎల్లుండి.. శని,ఆదివారం సెలవురోజుల కావడంతో ఇవాళ్టినుండి విధులకు దూరంగా వుండాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పెన్ డౌన్, యాప్ డౌన్ చేపట్టారు.
ఇదిలావుంటే గురువారం ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ విజయవంతం కావడంతో పీఆర్సీ సాధన సమితి కూడా స్పీడ్ పెంచింది. ఓవైపు ప్రభుత్వంతో చర్చల గురించి సమాలోచనలు చేస్తూనే మరోవైపు సమ్మెను సక్సెస్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఛలో విజయవాడ మాదిరిగానే ఉద్యోగులందరినీ ఒకేతాటిపైకి తెచ్చి సమ్మెలో పాల్గొనేలా చేయడంద్వారా ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని ఉద్యోగసంఘాలు భావిస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు ఆర్టిసి ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో స్కూల్లు మూతపడటంతో పాటు ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. అయితే ఉద్యోగులు సమ్మెకు దిగితే బస్సులను నడిపే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసి ఛైర్మన్ వెల్లడించారు.
ఉద్యోగులు సమ్మెకు దిగకుండా బుజ్జగించే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఉద్యోగుల పీఆర్సీతో ఆర్టీసి ఉద్యోగుల పీఆర్సీకి అసలు సంబంధమే లేదని ఆర్టీసి ఛైర్మన్ మల్లికార్జున్ రెడ్డి పేర్కొన్నారు. కాబట్టి ఆర్టీసి ఉద్యోగులు సమ్మెకు దిగడంలో లాభం లేదని... ఏమైనా సమస్యలుంటూ సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకుందాం అంటూ ఛైర్మన్ బుజ్జగించే ప్రయత్నంచేసారు.