ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Published : Jul 11, 2019, 09:13 AM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా... స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. 


 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా... స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. మరోవైపు నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి నిర్వహిస్తున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 14 రోజుల పాటు సమావేశాలు జరగనుండగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అదేరోజు వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్నబాబు ప్రత్యేకంగా సమర్పిస్తారు.   కాగా శాసనమండలి సమావేశాలు 10 గంటలకు మొదలు కానున్నాయి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?