ప్రాణాలు తీసిన అగ్గిపెట్టె గొడవ.. మద్యం మత్తులో యువకుడి హత్య...

Published : May 24, 2021, 11:30 AM IST
ప్రాణాలు తీసిన అగ్గిపెట్టె గొడవ.. మద్యం మత్తులో యువకుడి హత్య...

సారాంశం

అగ్గిపెట్టె విషయంలో మొదలైన గొడవ చివరికి ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్ల కావలిలో జరిగింది.  నెల్లూరుకు చెందిన యువకులైన రెండు బ్యాచులు వేర్వేరుగా మద్యం సేవిస్తున్నారు.

అగ్గిపెట్టె విషయంలో మొదలైన గొడవ చివరికి ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్ల కావలిలో జరిగింది.  నెల్లూరుకు చెందిన యువకులైన రెండు బ్యాచులు వేర్వేరుగా మద్యం సేవిస్తున్నారు.

ఒక బ్యాచ్ లోని ఓ వ్యక్తి, మరో బ్యాచ్ లోని వారి దగ్గరికి వెళ్లి అగ్గిపెట్టె అడిగాడు. ఏమైందో తెలియదు కానీ అక్కడ వివాదం మొదలయ్యింది. ఇది చివరికి ఆ యువకుడి ప్రాణాలు తీసింది. ఆదివారం నాడు కావలిలో ఈ దారుణం జరిగింది. 

కావలి టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కావలి పట్టణంలో ఉన్న కో ఆపరేటివ్ కాలనీలోని తాళాలు వేసి ఉన్న ఓ విద్యాసంస్థల ప్రాంగణంలోకి గోడలు దూకి కొందరు యువకులు మద్యం తాగుతున్నారు. 

వారిలో చంద్రవేఖర్ అనే యువకుడు అగ్గిపెట్టె కోసం మరో బ్యాచ్ వద్దకు వెళ్లాడు. దీంతో వారి మధ్య వివాదం మొదలయ్యింది. ఈ వివాదంలో షేక్ జమీరుద్దీన్ (25) మరణించారు. ఈ మేరకు మృతుడి తండ్రి పోలీసులకు తన కుమారుడైన షేక్ జమీరుద్దీన్ ను బోగిరి నిఖిల్ పట్టుకోగా, కాకి రాహూల్ బీరు బాటిల్ తో గొంతులో పొడిచి చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

కాగా మృతుని స్నేహితుడైన పృధ్వీరాజ్ కు తీవ్రగాయాలు అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. టూ టౌన్ సీఐ మల్లికార్జునరావు, ఎస్సై టి. అరుణకుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఘనంగా ఉగాది పురస్కారాలు అందించిన సీఎం చంద్రబాబు | Ugadi Kalaratna Purashkaralu | Asianet News Telugu
ఈ ఏడాది జగన్ జాతకం ఎలా ఉందంటే | YS Jagan Attends Ugadi Panchanga Sravanam 2026 | Asianet News Telugu