Agnipath: గుంటూరు రైల్వే స్టేషన్ వైపు దూసుకొచ్చిన ఆర్మీ అభ్యర్థులు.. 200 మంది అరెస్ట్

Published : Jun 18, 2022, 11:21 AM IST
Agnipath: గుంటూరు రైల్వే స్టేషన్ వైపు దూసుకొచ్చిన ఆర్మీ అభ్యర్థులు.. 200 మంది అరెస్ట్

సారాంశం

Agnipath protests: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా విజయవాడ, కర్నూలు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్మీ అభ్యర్థులు నిరసనలు తెలుపడానికి రావడంతో గుంటూరులో ప్రస్తుత వాతావరణం ఉద్రిక్తంగా మారింది.   

Andhra Pradesh: కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీమ్ ను వ్య‌తిరేకిస్తూ.. దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేయ‌డానికి ఆర్మీ అభ్య‌ర్థులు సిద్ధ‌మ‌వుతున్నార‌ని నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద భారీగా బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఈ క్ర‌మంలోనే గుంటూరు రైల్వే స్టేషన్ వైపు భారీగా ఆర్మీ అభ్య‌ర్థులు అగ్నిప‌థ్ పై నిర‌స‌న‌లు తెల‌ప‌డానికి దూసుకొచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. నిర‌స‌నకారుల్లో ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 200 మంది ఆర్మీ అభ్య‌ర్థుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెల‌కొన్న‌ది. 

త‌మ‌కు అందుతున్న రిపోర్టుల క్ర‌మంలోనే రాష్ట్రంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పోలీసులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు గుంటూరు పోలీసులు తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద భారీ భద్రత పెంచారు. కాగా, శుక్రవారం నాడు తెలంగాణ‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో వేల మంది నిరుద్యోగులు, ఆర్మీ అభ్య‌ర్థులు నిర‌స‌న‌ల‌కు దిగారు. పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మారాయి. ఒక‌రు చ‌నిపోగా.. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. నిన్న తెలంగాణ‌లో జ‌రిగిన అగ్నిప‌థ్ ఆందోళ‌న‌లు.. నేడు ఏపీని తాకాయి. ఏపీలోని రైల్వే స్టేష‌న్ల‌లో ఆందోళ‌న‌లు జ‌రిగే అకాశ‌ముంద‌నే హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. దీందో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. 

శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా విజయవాడ, కర్నూలు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ సైనిక నియామక పథకానికి వ్యతిరేకంగా నిరసనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా రైల్వే అధికారులు శనివారం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను మూసివేసి, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్మీ ఆశావహులు భారీ నిరసనలకు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరికలను అనుసరించి, అధికారులు స్టేషన్‌ను మూసివేసి, ఉదయం 7 గంటలకు రైళ్లను నిలిపివేశారు. మధ్యాహ్నం వరకు స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఉదయం 7 గంటల వరకు స్టేషన్‌లోకి అనుమతించారు. తర్వాత, స్టేషన్‌ను అందరికీ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

విజయవాడ నుంచి వచ్చే అన్ని రైళ్లను శివార్లలోని దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఆపడం లేదా దారి మళ్లించడం జరిగింది. హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్తవలస వద్ద ఆపడం లేదా దారి మళ్లించడం జరిగింది. మరోవైపు గుంటూరు రైల్వే స్టేషన్‌లో సైన్యంలో చేరాలని భావిస్తున్న యువత భారీ నిరసనకు దిగుతున్నట్లు సమాచారం అందడంతో హైఅలర్ట్ ప్రకటించారు. అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసి, టిక్కెట్లను తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణికులను ప్రాంగణంలోకి అనుమతించారు. గుంటూరు స్టేషన్‌ వైపు వెళ్తున్న 20 మంది యువకులను కొత్తపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు స్టేషన్‌లో నిరసన తెలియజేయాలని వాట్సాప్‌లో సందేశాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో అప్రమత్తం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu