కన్నతల్లి మృతదేహంతో ఐదురోజులు.. సోదరి మృతదేహంతో వారం రోజులు...

By AN TeluguFirst Published Jan 5, 2021, 3:56 PM IST
Highlights

కన్నతల్లి మృతదేహంతో ఐదు రోజులకుపైగా కలిసివున్న కుమారుడి ఉదంతం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తీవ్ర కలకలం రేపింది. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు వచ్చిన ఆశావర్కర్లమీద ఆ కొడుకు అరవడమే కాకుండా, తన తల్లి నిద్ర పోతుందని డిస్ట్రబ్ చేయద్దని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు రెండేళ్ల క్రితం సోదరి చనిపోయినప్పుడు పది రోజులపాటు ఇదే మాదిరి ఉన్న సంఘటనను వారు గుర్తు చేసుకుంటున్నారు. 

జీలుగుమిల్లికి చెందిన తలుకూరి మంజులాదేవి (79) సంపన్నకుటుంబీకురాలు. ఈమెకు 50 ఏళ్ల క్రితం నెల్లూరు ప్రభుత్వ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న కృష్ణారావుతో వివాహం జరిగింది. ఆయన ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్‌లో మృతి చెందారు. భర్త మరణానంతరం నెల్లూరులోని పొలాలు,షాపింగ్‌ కాంప్లెక్స్‌లు అన్యాక్రాంతానికి గురయ్యాయి. 

ఆస్తులను కాపాడుకోవడానికి తల్లి, కొడుకు, కూతురు ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు దీంతో మంజులాదేవి ఆమె కుమార్తె అరుణ జ్యోతి, కొడుకు రవీంద్రఫణి ఎంతో కుమిలిపోయారు. అప్పటి నుంచి జంగారెడ్డిగూడెంలోని మేఘన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.

కొడుకు రవిచంద్ర ఇంజనీరింగ్‌ పూర్తి చేసి పుణెలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి..  తల్లికి తోడుగా వచ్చేశాడు. కొన్నేళ్లుగా ఆ ఇంట్లో మంజులా, రవిచంద్ర, అరుణ జ్యోతి నివసిస్తున్నారు. 2018 జూన్‌ 10న ఇంట్లోనే తన కుమార్తె జ్యోతి (41) మృతి చెందింది. దాదాపు వారం రోజులకు పైగానే మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని తల్లి మంజులాదేవి, కొడుకు రవిచంద్ర ఉన్నారు. 

స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి చూస్తే ఆమె మృతి చెందినట్టు గుర్తించారు. ఇప్పుడు తల్లి మంజులాదేవి మృతి చెందడం, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా రవిచంద్ర ఇంట్లోనే వున్న విషయం సోమవారం బయటపడింది. వీరి ప్లాట్‌ నుంచి దుర్వాసన వెదజల్లడంతో పక్క ప్లాట్‌ల్లోని వారు ఆశ వర్కర్లకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తలుపు కొట్టారు. రవీంద్ర తలుపు తీయగానే భరించలేని దుర్వాసన వెదజల్లింది. లోపలకు వెళ్లి చూసేసరికి మంజులాదేవి మృతదేహం కనిపించింది.

ఐదు రోజుల క్రితమే ఆమె మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. కుమారుడు మాత్రం తన తల్లి మంజులాదేవి చనిపోలేదని నిద్రపోతుందని ఆమెను లేపవద్దంటూ పెద్దగా కేకలు వేయడంతో ఆశ వర్కర్లు భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి అతనితో మాట్లాడి మంజులాదేవి మృతదేహాన్ని మున్సిపల్‌ అధికారులకు అప్పగించారు. రవీంద్రకు మతి స్థిమితం లేదని దీంతో ఆమె తల్లి మరణించినా నిద్రపోతుందనే భావనలో ఎవరికీ చెప్పకుండా అక్కడే ఉంటున్నాడని చెబుతున్నారు.

click me!