విద్యార్థి సంఘాల చలో రాజ్‌భవన్‌.. పరిసరాల్లో ఉద్రితక్తత.. 144 సెక్షన్ విధించిన పోలీసులు..

By Sumanth KanukulaFirst Published May 14, 2022, 10:49 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. ఈ క్రమంలోనే పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో రాజ్‌భవన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. ఈ క్రమంలోనే పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో రాజ్‌భవన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలు.. రాయలసీయ యూనివర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్‌ చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి సంఘాలు చలో రాజ్‌భవన్‌కు పిలునిచ్చాయి.153 మంది విద్యార్థులను పరీక్షలకు అనుమతించకుండా వారి జీవితాలు నాశనం చేశారని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 13 మంది విద్యార్థులపై అక్రమ సస్పెన్షన్, కేసులను ఎత్తివేయాలని కోరుతున్నారు. డిగ్రీ పరీక్ష ఫలితాలపై పరీక్ష విభాగంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు నేడు రాజ్ భవన్ ముట్టడికి యత్నించాయి. దీంతో రాజ్‌భవన్ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాజ్‌భవన్‌, ధర్నాచౌక్‌లో సీపీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్టు అమలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
 

click me!