ఏపీలో కరోనా జోరు: ఆరు లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు

By narsimha lodeFirst Published Sep 16, 2020, 5:42 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 8835 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 60 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 5 లక్షల 92 వేల 760కి చేరుకొన్నాయి. 

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 8835 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 60 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 5 లక్షల 92 వేల 760కి చేరుకొన్నాయి. 

రాష్ట్రంలో 90,279 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సోకిన 4 లక్షల 97వేల 376 మంది కోలుకొన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లో 75,013 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 8,835 మందికి కరోనా సోకినట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 64 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో  మరణించిన వారి సంఖ్య  5,105 మందికి చేరుకొంది.


గత 24 గంటల్లో అనంతపురంలో 725, చిత్తూరులో 798, తూర్పుగోదావరిలో 1421, గుంటూరులో 685, కడపలో 536, కృష్ణాలో 396, కర్నూల్ లో 424, నెల్లూరులో 562, ప్రకాశంలో  873, శ్రీకాకుళంలో 495, విశాఖపట్టణంలో 325, విజయనగరంలో 544 పశ్చిమగోదావరిలో 1051 కేసులు నమోదయ్యాయి. 


రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -50,813, మరణాలు 425
చిత్తూరు  -51,516 మరణాలు 552
తూర్పుగోదావరి -81,064, మరణాలు 467
గుంటూరు  -47,330 మరణాలు 475
కడప  -367,688, మరణాలు 320
కృష్ణా  -22269, మరణాలు 362
కర్నూల్  -52,704, మరణాలు 429
నెల్లూరు -45,512 మరణాలు 405
ప్రకాశం -38,738 మరణాలు 395
శ్రీకాకుళం -33,920 మరణాలు 298
విశాఖపట్టణం  -45,237, మరణాలు 370
విజయనగరం  -29,503, మరణాలు 206
పశ్చిమగోదావరి -53,571, మరణాలు 401


 

: 16/09/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,89,865 పాజిటివ్ కేసు లకు గాను
*4,94,481 మంది డిశ్చార్జ్ కాగా
*5,105 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 90,279 pic.twitter.com/bRdSUEzE4x

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!