ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 82 కేసులు, మొత్తం 1,259కి చేరిక

By narsimha lodeFirst Published Apr 28, 2020, 11:30 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  24 గంటల్లో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలోకి కరోనా కేసులు 1259కి చేరుకొన్నాయి.కరోనా వైరస్ సోకి ఇప్పటికి 31 మంది మృతి చెందారు.
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  24 గంటల్లో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలోకి కరోనా కేసులు 1259కి చేరుకొన్నాయి.కరోనా వైరస్ సోకి ఇప్పటికి 31 మంది మృతి చెందారు.

గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,783 శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 82 కొత్త కేసులు  నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.  24 గంటల్లో కర్నూల్ జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది. గుంటూరులో 17 కేసులు నమోదయ్యాయి.

 

రాష్ట్రంలో గత 24 గంటల్లో 5783 సాంపిల్స్ ని పరీక్షించగా 82 మంది కోవిడ్19 పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1259 పాజిటివ్ కేసు లకు గాను 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 970 pic.twitter.com/g0kHgvEGai

— ArogyaAndhra (@ArogyaAndhra)

అనంతపురంలో 1, చిత్తూరులో 1, కడపలో 07, కృష్ణాలో 13, నెల్లూరులో 03 కేసులు నమోదయ్యాయి. ఈ 82 కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,259కి చేరుకొన్నాయి. ఈ కేసుల్లో 970 యాక్టివ్ కేసులుగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 258 మంది ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. 

also read:పశ్చిమగోదావరిలో వైన్స్ షాపు వద్ద వాచ్‌మెన్ వెంకటేష్ సజీవ దహనం

రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 332 కేసులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది. గుంటూరులో 254 కేసులు చోటు చేసుకొన్నాయి. 

గుంటూరు తర్వాతి స్థానంలో కృష్ణా నిలిచింది. కృష్ణా జిల్లాలో 223 కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 82, చిత్తూరులో 74, కడపలో 65 కేసులు నమోదయ్యాయి.
ప్రకాశంలో 56, పశ్చిమగోదావరిలో 54, తూర్పుగోదావరిలో 39, విశాఖపట్టణంలో 22 ,శ్రీకాకుళంలో 4 కేసులు నమోదయ్యాయి.


 


 

click me!